Thursday, April 25, 2024

మళ్ళీ తగ్గిన బంగారం ధరలు

దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. మగువలు అయితే బంగారం అంటే పడిచచ్చిపోతారు. అయితే గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. తాజా ధరలు ప్రకారం హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు చూసుకుంటే…. 22 కారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.150 తగ్గి రూ.45,350 వ‌ద్ద ఉంది.

అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.160 తగ్గి రూ.49,470 వ‌ద్ద నిల‌క‌డ‌గా ఉంది. అలాగే వెండి ధ‌ర రూ.౩౦౦ పెరిగి రూ.76,200కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement