Friday, May 17, 2024

స‌రిగ‌మ చేతిలో – గాడ్ ఫాద‌ర్ ఆడియో హ‌క్కులు

గాడ్ ఫాద‌ర్ చిత్రానికి సంబంధించిన ఆడియో హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఆడియో సంస్థ స‌రిగ‌మ ద‌క్కించుకుంది.ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి..స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార, స‌త్య‌రాజ్ న‌టిస్తున్నారు. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. డేరింగ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ జ‌ర్న‌లిస్టు పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కాగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ జూలై 4న సాయంత్రం 5.45 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని సూప‌ర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌ల‌పై ఎన్‌.వీ ప్ర‌సాద్ నిర్మిస్తున్నాడు. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన ‘లూసీఫ‌ర్’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement