Thursday, June 13, 2024

Goa: ఐదేళ్ల చిన్నారి రేప్, మర్డర్‌…

గోవాలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసి హత్య చేశారు. వాస్కో వద్ద నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో పోలీసులు 20 మందిని విచారిస్తున్నారు.

- Advertisement -

వాడెం ప్రాంతంలో ఉన్న నిర్మాణ ప్రదేశంలో ఆ చిన్నారి అపమారక స్థితిలో కనిపించింది. అయితే డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లిన సమయంలో ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. ఎస్పీ సునితా సావంత్ ఈ అంశంపై మీడియాకు వెల్లడించారు. అత్యాచారం చేసి, గొంతు పిసికి చంపినట్లు పోస్టు మార్టమ్ రిపోర్టులో తేలింది. ఐపీసీ, పోక్సో చట్టాల ప్రకారం రేప్, మర్డర్ కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న 20 మంది కార్మికులను పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement