Tuesday, April 16, 2024

ఈనెల 30కి జ్ఞానవాపీ కేసు విచారణ..

వారణాశి: జ్ఞానవాపీ కాంప్లెక్స్‌ కేసు విచారణను జిల్లా కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో గురువారం ముస్లింల వాదనను విన్న కోర్టు, కేసు విచారణఅర్హతపై విచారణను ఈనెల 30వ తేదీ, సోమవారానికి వాయిదా వేసినట్లు జిల్లా ప్రభుత్వ ప్లీడర్‌ రానా సంజీవ్‌ సింగ్‌ మీడియాకు వెల్లడించారు.

జ్ఞానవాపీ కాంప్లెక్‌ కేసు విచారణ అర్హతపై ఈనెల 26న విచారించనున్నట్లు కోర్టు ఈనెల 24న ప్రకటించింది. కోర్టు పర్యవేక్షణలో తీసిన వీడియోగ్రఫీ సర్వేపై హిందు, ముస్లింవర్గాలకు ఉన్న అభ్యంతరాలను తెలియచేయడానికి వారం రోజులు గడువునిచ్చింది. ఈనెల 20వ తేదీన సుప్రీంకోర్టు జ్ఞానవాపీ కాంప్లెక్స్‌ కేసును జిల్లా సివిల్‌ జడ్జి కోర్టుకు బదిలీ చేసింది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement