Friday, May 17, 2024

GT vs RR | గిల్, మిల్లర్లదే ఆట.. ! రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..

డబుల్ హెడర్ లో భాగంగా ఇవ్వాల (ఆదివార) జరుగుతోన్న రెండో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ రాజస్తాన్ రాయల్స్ కి డీసెంట్ టార్గెట్ ను సెట్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 29 బంతుల్లో 46 రన్స్ చేశాడు. శుబ్ మన్ గిల్ 34 బంతుల్లో 45 రన్లతో రాణించాడు.

ఆఖర్లో అభినవ్ మనోహర్ ధనాధన్ (13 బంతుల్లో 27) షాట్లతో రాజస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్,  ఆడమ్ జంపా, యుజువేంద్ర చహల్ లకు తలా ఒక వికెట్ లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement