Friday, September 24, 2021

ప్రొ.కబడ్డీ: తెలుగు టైటాన్స్ జట్టులో ఆడనున్న పాలమూరు బిడ్డ

ప్రొ.కబడ్డీ లీగ్-2021 పోటీలకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావాసి ఎంపికయ్యాడు. త్వరలో జరగనున్న ప్రో కబడ్డీ పోటీల్లో తెలుగు టైటాన్స్‌ జట్టు తరఫున జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని భీంపురం గ్రామానికి చెందిన గాళ్ల రాజురెడ్డి బరిలోకి దిగనున్నాడు.

తెలుగు టైటాన్స్‌ జట్టుకు నడిగడ్డ ప్రాంతానికి చెందిన యువకుడు ఎంపిక కావడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంత కబడ్డీ ఆటగాళ్లతోపాటు అసోసియేషన్‌ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొనే జట్టుకు రాజురెడ్డి ఎంపికవడం జిల్లాకే గర్వకారణమని సామాజిక కార్యకర్త సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. పోటీల్లో బాగా రాణించి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు డేల్ స్టెయిన్ రిటైర్మెంట్

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News