Thursday, March 28, 2024

రక్షణ రంగంలో ముందడుగు.. 76వేల కోట్లతో ఆయుధాల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్‌

దేశ రక్షణ రంగంలో కీలక ముందడుగు పడింది. దేశీయ పరిశ్రమల నుంచి రూ. 76వేల390కోట్ల మిలిటరీ పరికరాలను కొనుగోలు చేసేందుకు సోమవారం కేంద్ర రక్షణశాఖ ఆమోదముద్ర వేసింది. దేశీయ పరిశ్రమల నుంచి మిలటరీ పరికరాలను కొనుగోలు ప్రతిపాదనలను, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలోని డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) ఆమోదించినట్లు కేంద్రరక్షణ శాఖ ప్రకటించింది. ఇండియన్‌ నేవీ కోసం రూ. 36,000 కోట్ల అంచనాతో నెక్ట్స్‌ జనరేషన్‌ కార్వెట్టీస్‌ను కొనుగోలు చేయడానికి డీఏసీ ఆమోదించింది. ఈ ఎన్‌జీసీలు సర్వైవల్స్‌ మిషన్స్‌, ఎస్కార్ట్‌ ఆపరేషన్స్‌, డిటెర్రెన్స్‌, సర్ఫేజ్‌ ఏక్షన్‌ గ్రూపు (సీఏజీ) ఆపరేషన్స్‌, సెర్చ్‌, అటాక్‌ లతో పాటు సముద్రతీరగస్తీని సైతం నిర్వహించగల సత్తా కలిగినవి.

ఈ ఎన్‌జీలను ఇండియన్‌ నేవీ కోసం డిజైన్‌ చేయడం జరిగిందని, ఓడల నిర్మాణానికి కొత్త టెక్నాలజీని ఉపయోగించేందుకని మిలటరీ ఒక ప్రకటనలో తెలిపింది. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ద్వారా డార్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, సు-30 ఎంకెఐ ఏరోను రూపొందించేందుకు సైతం డిఏసీ ఆమోదించింది. ఇండియన్‌ ఆర్మీ కోసం రఫ్‌ టెర్రియన్‌ ఫోర్క్‌ లిఫ్ట్‌ ట్రక్స్‌ (ఆర్‌టీఎఫ్‌ఎల్‌టీఎస్‌), బ్రిడ్జ్‌ లేయింగ్‌ ట్యాంక్స్‌ (బీఎల్‌టీఎస్‌), వీల్డ్‌ ఆర్మౌర్డ్‌ ఫైటింగ్‌ వెహికల్స్‌ (డబ్ల్యుహెచ్‌ ఏఎఫ్‌విఎస్‌), వెపన్‌ లొకేటింగ్‌ రాడార్స్‌ కొనుగోలుకు కూడా డీఏసీ ఆమోదముద్ర వేసింది. రక్షణ రంగాన్ని డిజిటలైజేషన్‌ చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా డిజిటల్‌ కోస్ట్‌ గార్డ్‌ ప్రాజెక్టును కూడా డీఏసీ ఆమోదించినట్లు రక్షణశాఖ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement