Friday, May 17, 2024

హైదరాబాద్‎లో భారీ విస్తరణ దిశగా ఫ్లిప్‌కార్ట్ సంస్థ

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా 8 లక్షల చదరపు అడుగులకు పైగా గోడౌన్ల సామర్థ్యాన్ని పెంచాలని ఫ్లిప్ కార్ట్ భావిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ గోడౌన్‎ను విస్తారించాలనుకుంటోంది. హైదరాబాద్‎తో పాటు ఢిల్లీ, చెన్నై, కోయంబత్తూరు నగరాలలోని ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఫ్లిప్ కార్ట్‌కు 15 గోడౌన్లు ఉన్నాయి. వీటిలో నిల్వసామర్థ్యం 25 లక్షల క్యూబిక్ ఫీట్లు ఉంది. హైపర్‌ లోకల్‌ సర్వీసు ద్వారా ప్రజలు తమ రోజువారీ అవసరాలను 90 నిమిషాల్లో పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఇతర మెట్రో నగరాలు కూడా ఈ సేవలో దశలవారీగా రానున్నట్లు తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్‌ జూలై 2020లో ఫ్లిప్‌కార్ట్‌ క్విక్‌ బ్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో తాజా పండ్లు, కూరగాయలు, మాంసం, కిరాణ వస్తువులు, మొబైళ్లు, ఎలక్ర్టానిక్‌, శిశువు సంరక్షణ ఉత్పత్తులు 90 నిమిషాల్లో డెలివరీ చేయనున్నారు. ఈ డెలివరి కింద 3 వేలకుపైగా ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సేవలు బెంగళూరుకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. అయితే ఇప్పుడు ఆరు కొత్త నగరాలను కవర్‌ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు ఎప్పుడైన ఆర్డర్‌ చేయవచ్చని సూచించింది. అయితే కస్లమర్లకు వీలైనంత త్వరగా ప్రొడక్ట్స్‌ని డెలివరీ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌ షాడోప్యాక్స్‌ లాంటి లాజిస్టిక్స్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. 200 రకాలకు పైగా 7 వేల ఉత్పత్తులను ఫ్లిప్ కార్ట్ గ్రాసరీ విక్రయిస్తోంది. ఇందులో ప్రస్తుతం దాదాపుగా 64 ఆర్డర్లనే తీసుకోగలుగుతున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement