Saturday, May 25, 2024

Breaking: హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు కలకలం…

ముంబయిలో బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.

- Advertisement -

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సల్మాన్ ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే సల్మాన్కు పలుమార్లు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఆయన ఇంటి వద్ద కాల్పులు కలకలం రేపడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న భాయిజాన్ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫేవరెట్ హీరోకు ఏం జరగకూడదంటూ ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ విషయం వైరల్ కావడంతో సల్మాన్ ఫ్యాన్స్ ఆయనకు ఏం జరగకూడదంటూ పోస్టులు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement