Friday, February 16, 2024

Odisha : ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఘోర రోడ్డుప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందిన విషాద ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఓ ట్రక్కును ఓ వ్యాన్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. గంజాంలోని దిగపహండి నుంచి కెంధూఝర్ జిల్లాలోని ఘటగావ్ లోని తారిణి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

తారణి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ లో 20మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ముగ్గురు మహిళలతో సహా ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి స్థానికుల సహాయంతో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులందరూ గంజాం జిల్లాలోని పొడమరి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement