Sunday, February 25, 2024

మీరంద‌రూ నా సోద‌రుల కంటే ఎక్కువ.. ఎన్టీఆర్

మీరు చూపిస్తున్న అభిమానానికి ప‌దాలు క‌నిపెట్ట‌లేద‌న్నారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. అమెరికాలో ఫ్యాన్స్ తో ఏర్పాటు చేసిన మీటింగ్ లో మాట్లాడాడు ఎన్టీఆర్. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి వంద రెట్లు అభిమానం నా గుండెల్లో ఉంది. అది నేను చూపించ‌లేక‌పోతున్నాను అన్నారు. మ‌న మ‌ధ్య ఏ ర‌క్త సంబంధం లేదు. నేనేం చేసి మీకు ద‌గ్గ‌ర‌య్యానో నాకు తెలియ‌టం లేదు. మీరంద‌రూ నా సోద‌రుల కంటే ఎక్కువ. మ‌న‌ది ర‌క్త సంబంధం కంటే గొప్ప‌దైన బంధం. శిర‌స్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. అభిమానుల ప్రేమకు రుణప‌డిపోయానన్నారు. ఇంకో జ‌న్మంటూ ఉంటే ఈ అభిమానం కోస‌మే పుట్టాల‌ని కోరుకుంటున్నానని తెలిపారు. ఎన్టీఆర్ మాట్లాడుతున్నంత సేపు అభిమానులు అరుస్తూనే ఉన్నారు. కేకలు పెడుతూ ఆయన స్పీచ్ ను ఎంజాయ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement