Thursday, October 10, 2024

Fake Mails – బెంగుళూరులో 44 స్కూళ్ల‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ ….

బెంగూళురులోని 44 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 44 స్కూళ్లలో బాంబు పెట్టిన వార్తతో బెంగళూరు ఉలిక్కిపడింది. విద్యార్ధుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీసులు విద్యార్ధులను వెంటనే ఇళ్లకు పంపించేశారు. స్కూల్ గ్రౌండ్‌లో పేలుడు పదార్ధాలు ఉంచినట్లు మెయిల్‌లో బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో పోలీసులు డిస్పోజల్ స్క్వాడ్‌తో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి పేలుడు పదార్ధం కనపడకపోవడంతో ఇదంతా ఫేక్ అని తేల్చారు. అయినా కూడా మెయిల్స్ పంపిన నిందితుల్ని కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నామని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement