Thursday, March 28, 2024

విమానాల్లో ఫేస్​ మాస్క్ తప్పనిసరి కాదు.. ఆంక్షలు సడలించిన విమానయాన శాఖ

దేశంలో కొవిడ్​ కేసులు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను సడిలిస్తోంది. ఇంతకాలం విమాన ప్రయాణికులపై కఠిన ఆంక్షలు విధించిన విమానయాన మంత్రిత్వ శాఖ ఒక్కొక్క అంశంపై సడిలింపులు ఇస్తోంది. కాగా, ఇకమీదట విమాన ప్రయాణికులు మాస్క్​ ధరించాల్సిన అవసరం లేదని, అది కంపల్సరీ కాదని తెలిపింది.

విమాన ప్రయాణంలో ఇకపై ఫేస్ మాస్క్ లు తప్పనిసరి కాదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అయితే కరోనావైరస్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు వీటిని ఉపయోగించడమే మంచిదని మంత్రిత్వ శాఖ తెలిపింది. విమాన ప్రయాణ సమయంలో మాస్క్ కానీ, ఫేస్ కవర్లను తప్పనిసరిగా ఉపయోగించాల్సిన విషయంపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని విమానయాన సంస్థలకు మంత్రిత్వ శాఖ తన ఆర్డర్‌లో ఫేస్ మాస్క్ ల గురించి ఓ ప్రకటన జారీ చేసింది. మాస్క్​ లేకున్నా విమానాల్లో జర్నీ చేయొచ్చని, దీనిపై ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement