Friday, October 11, 2024

రాష్ట్రపతి ముర్ముకు కంటి ఆపరేషన్‌

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉదయం కుడి కంటికి క్యాటరాక్ట్‌ సర్జరీ చేయించుకు న్నారు. ఆర్మీ ఆసుపత్రిలో కంటి శస్త్రచికిత్స విజయవంతమైందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్‌ అయ్యారని రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము గత అక్టోబర్‌ 16న ఎడమ కంటికి క్యాటరాక్ట్‌ సర్జరీ చేయించుకున్నారు. రాష్ట్రపతి మెజెస్టి క్యాటరాక్ట్‌తో బాధపడుతుండగా.. బ్రిగేడియర్‌ ఎస్‌కే మిశ్రా బృందం విజయవంతంగా సర్జరీ చేసిందని పేర్కొంది. ప్రస్తుతం కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొంది

Advertisement

తాజా వార్తలు

Advertisement