Monday, April 29, 2024

TS | మ‌ద్యం దుకాణాల్లో కాలం చెల్లిన బీర్లు.. టాస్క్ ఫోర్స్ దాడుల్లో విస్తుపోయే వాస్త‌వాలు!

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్): ఓరుగల్లు మహానగరంలో కాలం చెల్లిన బీర్లు విక్రయిస్తున్న వైన్ షాప్స్ పై వరంగల్ టాస్క్ ఫోర్స్ కు చెందిన అయిదు టీమ్స్ శుక్రవారం మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో నాలుగు వైన్ షాపుల నుండి 2 లక్షల విలువ గల ఎక్స్ ఫైరి బీరు నిల్వలను సీజ్ చేశారు. కాలం తీరిన బీర్ల విక్రయాల బాగోతంపై వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ అలిగేటి మధుసూదన్ పత్రికలకు ప్రకటన విడుదల చేశారు.

వేసవి కాలంలో బీర్లకు డిమాండ్ ఉంటుందని వైన్ షాప్ యజమానులు ఐ ఎం ఎఫ్ ఎల్ నుండి పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టి బీర్లను నిల్వ చేసుకొన్నారు. కానీ వైన్ షాప్ యజమానులు ఆశించిన రీతిలో బీర్ల సేల్స్ కాలేదు. అదీగాక బీర్లు విక్రయించేందుకు ఉన్న కాల పరిమితి ముగిసింది.

కాలం చెల్లిన బీర్లను సదరు కంపెనీలకు వాపస్ పంపడమో లేదా ఎక్స్ ఫైరీ డేట్ ముగిసిన బీర్లను ధ్వంసం చేయాల్సి ఉంది. కానీ వైన్ షాప్ యజమానులు ఆర్ధికంగా నష్టపోవడానికి ఇష్టపడక గుట్టుగా వినియోగదారులను మోసం చేసే స్కెచ్ వేసి అమలు పర్చారు. పెట్టుబడులను నష్ట పోకుండ ఉండేందుకు బీర్లపై ముద్రించిన ఎక్స్ ఫైరీ డేట్స్ కనిపించకుండా ఉండే విధంగా కంప్యూటర్ ద్వారా స్టికర్స్ తయారీ చేసి,బీర్లపై అంటించి దర్జాగా విక్రయిస్తున్నారు.

తయారీ తేదీ నుండి నిర్ణీత కాల పరిమితి లోగా విక్రయాలు జరుపుకోలేక మందుబాబుల వద్ద ఎం ఆర్ పి ధరల ప్రకారం విక్రయిస్తూ వారి ప్రాణాలతో చేలాగాటమాడుతున్నారు. ఈ విషయంపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందుకున్నారు. వరంగల్ ట్రై సిటీలోని పార్క్ లైన్ వైన్స్ షాప్స్ లో జోరుగా,బహిరంగంగా కాలం చెల్లిన బీర్ల దందాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.

టాస్క్ ఫోర్స్ కు చెందిన ఐదుగురు ఇన్స్ పెక్టర్ల నేతృత్వంలో శుక్రవారం దాడులు చేశారు. బ్రో కంపెనీ బీర్ల కాల పరిమితి గడువు ఈ ఏడాది మే 10వ, తేదీతో ముగిసింది. ఎక్స్ ఫైరీ డేట్స్ కనిపించకుండా స్టిక్కర్స్ వేసి బీరు ప్రియులను మోసం చేస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడితో బట్టబయలైంది. సుబేధారి ఫారెస్ట్ ఆఫీస్ వద్ద గల పార్క్ లైన్ వైన్స్, కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డు లోగల పార్క్ లైన్ మాల్, హన్మకొండ పెద్దమ్మగడ్డ లోని పార్క్ లైన్ వైన్స్, వరంగల్ లోని గోపాలస్వామి గుడి వద్ద గల పార్క్ లైన్ వైన్స్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement