Saturday, April 20, 2024

భట్టి విక్రమార్కతో ఈటెల రాజేందర్ భేటీ

తెలంగాణ కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత భ‌ట్టి విక్ర‌మార్క‌తో మాజీ మంత్రి, టీఆర్ఎస్ రెబ‌ల్ నేత ఈటెల రాజేంద‌ర్ భేటీ అయ్యారు. మంత్రివ‌ర్గం నుండి బ‌ర్త‌రఫ్ చేసిన త‌ర్వాత టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఈటెల రాజేందర్.. భ‌ట్టి ఇంటికి వెళ్లి సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈటెల సొంత పార్టీ పెడ‌తారా? లేదా బీజేపీలోకి వెళ్తారా? లేదా కాంగ్రెస్ పార్టీ నుండి ఆహ్వానం ఉందా? ఇలా ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్న త‌రుణంలో భ‌ట్టితో ఈటెల భేటీ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement