Sunday, April 28, 2024

National : ఈపీఎఫ్ఓ, పీఎంఓ డేటా లీకేజీ కలకలం… విచార‌ణ‌కు కేంద్ర ఆదేశం ..

దేశంలో డేటా లీకేజీ కలకలం రేపుతోంది. ప్రధాని కార్యాలయం (పీఎంఓ), ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)ల డేటాబేస్ నుంచి డేటా లీకైనట్లు స‌మ‌చారం. ఈ డేటా లీకేజీపై స్పష్టత ఇవ్వాలని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియాకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా, డేటా లీకేజీపై సమాచారం ఉంద‌ని, అయితే వాస్తవమా? కాదా? అని తెలుసుకునేందుకు రివ్యూ జరుపుతున్నామ‌ని, సీఈఆర్టీ. ఇన్ ఇచ్చే రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

డేటా లీకేజీ అంటూ వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్నట్లు కేంద్రానికి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. డేటా లీకేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామ‌ని, అయితే, సైబర్ నేరస్తులు ఒక సర్వర్ ను యాక్సిస్ చేసినట్లు కొన్ని వాదనలు వినిపిస్తున్నాయని, అందుకు తగ్గ ఆధారాలు లేవ‌ని అని స్పష్టం చేశారు.

- Advertisement -


గ్లోబల్ సాఫ్ట్‌వేర్, కోడ్ రిపోజిటరీ గిత్ హబ్‌లో చైనీస్ సైబర్ ఏజెన్సీలకు చెందిన కొన్ని పత్రాలు లీక్ అయ్యాయని, ఈ డాక్యుమెంట్‌లలో ఈపీఎఫ్‌ఓ, ఇండియన్ పీఎంఓ, ఇతర పబ్లిక్ నుండి డేటా ఉందని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో పలు పోస్ట్ లు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం నిజ‌నిజాల కోసం కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియాకు విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement