Sunday, April 28, 2024

Gujarath : వైద్యుడి నిర్లక్ష్యం… ఐదేళ్లుగా కడుపులో కత్తి…

వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్లుగా ఆ యువకుడి కడుపులో కత్తి ఉండిపోయింది. ఈ ఘటన గుజరాత్‌లో భరూచ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ యువకుడు ఐదేళ్ల కిందట కత్తి పోట్లకు గురయ్యాడు. గాయాలకు చికిత్స కోసం గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్తే.. అతడి గాయాలకు డాక్టర్ ఏవో మాత్రలు ఇచ్చాడు.

కానీ, యువకుడికి ఎక్సేరే, స్కానింగ్ వంటివి చేయలేదు. అప్పటి నుంచి యువకుడ్ని కడుపునొప్పి వేధించడం మొదలుపెట్టింది. ఈ నొప్పి కోసం అనేక హాస్పిటల్స్, డాక్టర్లను సంప్రదించాడు. అయినా, సరే ఫలితం లేకపోయింది. ఇటీవల ప్రమాదం జరగడంతో అసలు విషయం తెలిసింది. కడుపులో కత్తి ఉన్నట్టు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement