Friday, May 17, 2024

అవినీతి చైర్మ‌న్ మాకొద్దు..!

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ను మార్చాల్సిందే
పట్టుబడుతున్న కౌన్సిలర్లు
యాదగిరిగుట్ట టు హైదరాబాద్‌ క్యాంపును మార్చిన కౌన్సిలర్లు
దీర్ఘకాలిక సెలవుపై గజ్వేల్‌ కమిషనర్
ఏం జరుగుతోందంటూ ప్రభుత్వ పెద్దల ఆరా
గజ్వెల్‌పై ప్రతిపక్షాల గురి

అవినీతి చైర్మన్‌ చిన్న రాజమౌళి తమకొద్దని గజ్వెల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ కౌన్సిలర్లు పట్టుబడుతూ ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. వాటిని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌కు అందజేసి క్యాంపునకు తరలివెళ్లారు. దీనిపై జిల్లా స్థాయి బీఆర్‌ఎస్‌ నేతలు రంగంలోకి దిగి అసంతప్త కౌన్సిలర్లను బుజ్జగించే యత్నం చేసిన్పటికీ చైర్మన్‌ను గద్దెదింపాల్సిందేనని కౌన్సిలర్లు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి యాదగిరిగుట్ట క్యాంపునకు తరలిన 14 మంది కౌన్సిలర్లు అక్కడి నుండి హైదరాబాద్‌కు మకాం మార్చారు. చైర్మన్‌, కౌన్సిలర్ల వ్యవహారం ఇలా ఉండగానే మున్సిపల్‌ కమిషనర్‌ విద్యాదర్‌ 4 నెలల పాటు సుదీర్ఘ సెలవులో వెళ్లారు. దీంతో జిల్లా కలెక్టర్‌ మేనేజర్‌ బాలకష్ణను ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించారు. మొత్తానికి గజ్వెల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ వ్యవహారం ఇప్పుడు అధికార బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారింది. అసలు ఏం జరుగుతోందంటూ ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నారు. కాగా, సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ప్రతిపక్షాలు తాజా వ్యవహారంపై ఓ కన్నేశాయి. దీంతో గజ్వెల్‌ చైర్మన్‌ అవిశ్వాసం విషయమై రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాఫిగ్‌గా మారింది.
– ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్‌


గజ్వెల్‌ నియో జకవర్గం గజ్వెల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ వ్యవ హారం ఇప్పట్లో తెగేటట్లు కనబడటం లేదు. చైర్మన్‌ రాజమౌళి అవినీతి వ్యవహారంపై విసు గుచెందిన అధికారపార్టీ కౌన్సిలర్లే తిరుగుబావుటా జెండా ఎగుర వేశారు. ఇన్నాళ్లు సహించాం.. ఇక తాడోపే డో నిర్ణయించు కోవాలంటూ పట్టుపట్టి మ రీ అవి శ్వాస తీర్మాణం ప్రవేశపెట్టారు. కౌన్సిలర్ల తిరుగు బావుటా పై ఇప్పటికే జిల్లా అగ్రశ్రేణి నేతలు కల్పిం చుకుని వివాదాన్ని సద్ధుమనిగించే ప్రయ త్నం చేశారు. కానీ కౌన్సిలర్లు ససేమెరా అనడంతో చేసేదిలేక వ్యవహారాన్ని పెద్దల దృ ష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. పది రోజుల పాటు అసెంబ్లిd జరగ డంతో ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని, ఇక అసెంబ్లి ముగియడంతో ఈ విషయానికి పుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది . కోట్లాది రూపాయల నిధుల తో అభివృద్ధి పనులు చేపడుతున్నా ఇదేం తలనొప్పి అంటూ వెంటనే అసమ్మతికి చెక్‌పెట్టాలని ఆదేశాలు అందినట్లు తెలుస్తుంది.

అవినీతి చైర్మన్‌ మాకొద్దు..
గజ్వెల్‌- ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ రాజమౌళిపై కౌన్సిలర్లు పట్టు విడవడం లేదు. అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టి అటు నుండి అటే యాదగిరిగుట్ట క్యాంపుకు తరళిన కౌన్సిలర్లు అక్క డి నుండి హైదరాబాద్‌కు తమ మకాం మార్చినట్లు తెలుస్తుంది. గజ్వెల్‌ అభివృద్ధిలో భాగంగా మున్సి పాల్టిdకి భారీగా నిధులు వస్తే చైర్మన్‌ రాజమౌళి తన వర్గం(కౌన్సిలర్లు) వారికే పనులు కట్టుబెట్టి తమను నిర్లక్ష్యం చేశాడని ఇలా దాదాపు మూడు సంవత్స రాలు పట్టించుకోకుండా వ్యవహరించాడని ఇటీవల 22 కోట్ల నిధులు వస్తే కూడా తమ వారికే కట్టుబెట్టి అందులో సైతం మాకు అన్యాయం చేశాడని తప్పని పరిస్థితుల్లోనే అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టామని అసంతృప్త కౌన్సిలర్లు స్పష్టం చేస్తున్నారు. మేం పార్టీకి విధేయులమేనని, కేవలం చైర్మన్‌ రాజమౌళి చేస్తున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేఖమని తెలియచేస్తున్నారు. అధిష్టానం సైతం తమ ఆవేదనను లెక్కలోకి తీసుకుని చైర్మన్‌ను తొలగించి కొత్త చైర్మన్‌ను నియమించాలని వేడుకుంటున్నారు.

- Advertisement -

దీర్ఘకాలిక సెలవుల్లో కమిషనర్‌
గజ్వెల్‌ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్‌ ప్రాతి నిథ్యం వహిస్తుం డటంతో సహజంగానే రాష్ట్ర వ్యా ప్తంగా ఇక్కడే ఫోకస్‌ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ జరిగే పరిణామాణాలను రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు. ఈ నేపథ్యంలో గజ్వెల్‌-ప్రజ్ఞా పూర్‌ మున్సిపాల్టిd చైర్మన్‌ రాజమౌళిపై సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టడంతో ఇప్పు డు ఈ టాఫిక్‌గా హాట్‌గా మారి పోయింది. ఎప్పు డు ఏం జరుగు తుందో తెలియని ఉత్కం ఠలో ము న్సిపాల్టిd కమిష నర్‌ విద్యాదర్‌ 4 నె లల పాటు దీర్ఘకా లిక సెలవుపై వెళ్లిపోయాడు. ఆయన స్థానం లో మేనేజర్‌ బాలకృష్ణకు ఇంచార్జి కమిషన ర్‌గా కలెక్టర్‌ బాధ్యతలు అప్ప గించారు. ఇలా రోజురోజు గజ్వె ల్‌ మున్సిపాల్టిలో రాజకీయం రంగులు పులుముకుం టుం డగా ఎప్పుడు ఏం జరుగ నుందో నంటూ సర్వత్రా ఉత్కంఠగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement