Monday, June 24, 2024

Delhi | 18 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు..

లోక్‌సభ ఎన్నికలతోపాటు కేంద్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకారం పూర్తయిన నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలు జరిపేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశాలు ఈ నెల 18, 19 తేదీల్లో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌కు ఎన్నికైన ఎంపీల ప్రమాణం చేసేందుకు ఉద్దేశించి ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. తక్కువ వ్యవధితో కూడిన ఈ సమావేశాలు కేవలం కొత్త ఎంపీల ప్రమాణం స్వీకారానికే పరిమితం కానున్నట్లు సమాచారం.

ఈ సమావేశాల్లో ముందుగా ప్రొటెం స్పీకర్‌ కొత్త ఎంపీలతో ప్రమాణం చేయిస్తారు. అనంతరం ఎంపీలందరు కలిసి స్పీకర్‌ను ఎన్నుకుంటారు. మరుసటి రోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ తర్వాత తన కేబినెట్‌ సహచరులను ప్రధాని పార్లమెంట్‌కు పరిచయం చేస్తారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement