Monday, July 22, 2024

Judgement – సమ్మతమైనా అత్యాచారమే …. ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు

ఢిల్లీ హైకోర్టు మరో వ్యవహారంలో సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్​తో శారీరక సంబంధంపై కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి సమ్మతితోనే జరిగినప్పటికీ మైనర్‌తో శారీరక సంబంధాన్ని కొనసాగించడం అత్యాచార నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. 14 ఏళ్ల బాలిక గర్భం ధరించడానికి కారణమైన వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ అదనపు సెషన్స్‌ జడ్జి అమిత్‌ సహ్రావత్‌ ఈ విషయం తెలిపారు. మైన‌ర్ గ‌ర్భం చేయ‌డం ఫోక్స్ చ‌ట్టం నిందితుడికి వ‌ర్తిస్తుంద‌ని తేల్చి చెప్పారు.

2015 జనవరిలో నమోదైన ఈ కేసు విచారణ ముగింపు దశకు వచ్చింది. బాలికకు జన్మించిన బిడ్డకు తండ్రి నిందితుడేనని డీఎన్‌ఏ పరీక్షల్లో తేలింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘మైనర్ బాలికల విషయంలో వారి సమ్మతితోనే శారీరక సంబంధం కొనసాగినా అది అత్యాచారంగానే పరిగణించాల్సి ఉంటుంది. మైనర్​తో శారీరక సంబంధం అత్యాచారమే అవుతుంది. అలా పాల్పడిన వ్యక్తికి కఠిన శిక్ష పడుతుంది.’ అని డిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఇక అత‌డికి ఏడేళ్లు జైలు శిక్ష‌తో పాటు బాధితురాలికి అయిదు ల‌క్ష‌ల రూపాయిలు న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని తీర్పు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement