Tuesday, April 30, 2024

మునుగోడులో ఓటమి తప్పదని తెలిసే టీఆర్‌ఎస్‌ డ్రామాలు : కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోవడం ఖాయమని, ఓటమి తప్పదని తెలిసి టీ-ఆర్‌ఎస్‌ డ్రామాలు ఆడుతుందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఫామ్‌ హౌజ్‌ ఘటన టీఆర్‌ఎస్‌ కుట్రగా వర్ణించారు. ఉప ఎన్నిక కోసం టీ-ఆర్‌ఎస్‌ చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన చరిత్ర టీఆర్‌ఎస్‌దని మండిపడ్డారు. ఫిరాయింపులకు పెద్దపీట వేసింది కేసీఆర్‌.. ఫిరాయించిన వారికి మంత్రి పదవులిచ్చిన పార్టీ టీఆర్‌ఎస్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామాలు చేయించకుండా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికన చేర్చుకున్నారని, ఏ విధంగా మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీటీ-సీలు, జడ్పీటీ-సీలను చేర్చుకోలేదా అని నిలదీశారు. అక్రమ కేసులు, రాజకీయ బెదిరింపులతో చేర్చుకున్నారని మండిపడ్డారు. నైతిక విలువలు లేకుండా అనేకమందిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. తమకు ఆ అవసరం లేదని, 2023 వరకూ తాము వేచిచూడటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటు-ంబం నుంచి సీఎం పదవి చేజారిపోతుందని భయం టీఆర్‌ఎస్‌కు పట్టుకుందన్నారు. మునుగోడులో బీజేపీ నేతలకు కేటీ-ఆర్‌ ఫోన్‌ చేస్తే అది నైతికత. దీనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? ఫామ్‌ హౌజ్‌ ఘటనలో దొరికిన డబ్బులెంత? ఇప్పుడా డబ్బులు ఎటు పోయాయి. డబ్బుతో పట్టు-కున్నామని చెబుతున్న వాళ్లతో బీజేపీకి సంబంధం ఏమిటి? అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలతో టీ-ఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోతుందా?, వాళ్లేమైనా ప్రజాబలం ఉన్న నాయకులా అన్నారు. కొంతమంది పోలీసు అధికారులు దిగజారి వ్యవహరిస్తున్నారు. కేసులు పెట్టాలంటే మొదటి కేసు కేసీఆర్‌ పైనే పెట్టాలి అని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement