Friday, May 3, 2024

దీపిక ప‌దుకొణే బ‌ర్త్ డే.. ప్రాజెక్ట్ కె నుండి పోస్ట‌ర్

ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొణే. నేడు ఆమె బ‌ర్త్ డే.ఈ సంద‌ర్భంగా ప్రాజెక్ట్ కే చిత్రం నుండి ఆమె పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. చీకట్లో ఆశ.. అంటూ పోస్టర్‌పై క్యాప్షన్‌ ఇచ్చారు. ఎత్తైన కొండపై ఉన్న దీపికా పదుకొనే బ్యాక్‌ డ్రాప్‌లో సూర్య కాంతి పడుతుండగా.. బ్లాక్ షేడ్స్ లో ఆమె ముఖం సరిగ్గా కనిపించడం లేదు. హాలీవుడ్ సినిమాను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ స్టన్నింగ్‌ లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. సినిమా ఎంత ఎక్జయిటింగ్‌గా ఉండబోతుందో ఈ ఒక్క స్టిల్‌తో అర్థమవుతోంది.ఈ చిత్రంలో స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వినీద‌త్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న పఠాన్‌ జనవరి 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement