Friday, May 3, 2024

DC vs SRH | ఢిల్లీ ఆలౌట్.. 67 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలుపు

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిలీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ ముందు 267 పరుగుల టార్గెట్ సెట్ చేసిన హైదరాబాద్.. బౌలింగ్‌లోనే చెలరేగింది దీంతో ఢిల్లీని 199 పరుగులకే ఆలౌట్ చేసి ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో నాల్గవ స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకుంది.

ఢిల్లీ క్యాపిట్స్‌లో యంగ్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ 65 పరుగులతో హాఫ్ సెంచరీతో చెలరేగి ఈ సీజన్‌లోనే ఫాస్టెస్ట్ 50 సాధించిన రికార్డ్ సృష్టించాడు. ఇక పృథ్వీ షా 5 బంతుల్లోనే 16 పరుగులు చేసి ఔటయ్యాడు. అభిషేక్ పోరెల్ (42), కెప్టెన్ రిషబ్ పంత్ (44) ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక హైదరాబాద్ బౌటర్లలో టి నటరాజన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ మార్కండే చెరో రెండు వికెట్లు తీసారు. ఇక, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement