Friday, May 3, 2024

డ‌బ్బూ ర‌త్నాని ఫొటోషూట్.. షాకింగ్ గా విద్యాబాల‌న్ లుక్

డ‌ర్టీ పిక్చ‌ర్ చిత్రంతో త‌న‌లోని హాట్ యాంగిల్ ని ప‌రిచ‌యం చేసింది బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాల‌న్. కాగా రీసెంట్ గా డ‌బ్బూ ర‌త్నాని ఫోటోషూట్ కోసం బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ ఓ కొత్త ఫోటోను దిగింది. ఆ ఫోటోను డ‌బ్బూ ర‌త్నాని త‌న ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. కుర్చీపై కూర్చుని.. దుస్తులు లేకుండా ఉన్న విద్యాబాల‌న్‌.. ఒక చేతిలో న్యూస్ పేప‌ర్‌.. మ‌రో చేతిలో టీ గ్లాస్ ప‌ట్టుకుని కూర్చుంది. ఈ ఫోటోలో కొంత రొమాంటిక్ లుక్స్ ఇచ్చింది. హీల్స్ .. స‌న్‌గ్లాస్‌ల‌తో ద‌ర్శ‌న‌మిస్తున్న విద్యాబాల‌న్ ఫోటో ఇంట‌ర్నెట్‌లో దుమారం రేపుతోంది. విద్యా కొత్త అవ‌తారంపై కొంద‌రు ట్రోల్స్ చేస్తున్నారు. అదో డ‌ర్టీ పిక్చ‌ర్ అంటూ పోస్టు పెడుతున్నారు. ప‌రిణీత‌, ఇష్క్‌కియా, నో వ‌న్ కిల్డ్ జెస్సికా, ఖ‌హాని గురు, పా లాంటి చిత్రాల్లో విద్యాబాల‌న్ న‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement