Friday, May 3, 2024

కలెక్టర్‌ ఫొటోతో ఫేక్​ అకౌంట్​ క్రియేట్​.. డబ్బులు పంపాలని మెస్సేజులు

భద్రాద్రి కొత్తగూడెం, ప్రభన్యూస్‌ ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఫొటోతో సైబర్‌ నేరగాళ్లు మోసానికి యత్నించిన సంఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. సైబర్‌ మోసగాళ్లు వాట్సప్‌లో జిల్లా కలెక్టర్‌ డీపీ పెట్టి అత్యవసర సమావేశంలో ఉన్నానని.. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రజలకు నగదు పంపమని సందేశాలు పంపుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇటువంటి మోసగాళ్ల సందేశాలకు స్పందించవద్దని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ సూచించారు. తన పేరుతో నకిలీ ఖాతాతో వస్తున్న సందేశాలపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భద్రాద్రి జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. అటువంటి సందేశాలు వచ్చే నంబర్లు తక్షణమే సీజ్‌ చేయాలని ప్రభుత్వ సిబ్బందికి, ప్రజలకు కలెక్టర్‌ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement