Wednesday, May 15, 2024

ఢిల్లీలో కొవిడ్‌ డేంజర్‌ బెల్స్‌.. 15 రోజుల్లో పెరిగిన తీవ్రత..

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా అతివేగంగా వ్యాపిస్తూండటం ఆందోళనకలిగిస్తోంది. అటు కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రత్యేకించి ఢిల్లీ-నేషనల్‌ కేపిటల్‌ రీజియన్‌ ప్రాంతంలో కోవిడ్‌ వ్యాప్తి తీవ్రాతితీవ్రంగా ఉందని కోవిడ్‌ నెట్‌వర్క్‌ ప్రివెలెన్స్‌ సర్వేలో తేలింది. గడచిన రెండు వారాలలో కనీసం 500 శాతం మేర కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగిందని ఆ సర్వే తేల్చింది. ఢిల్లీ-నేషనల్‌ కేపిటల్‌ రీజియన్‌ ప్రాంతంలోని దాదాపు 11,943 మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. తమకు తెలిసిన కుటుంబాల్లో కనీసం ఒకరు లేదా ఇద్దరికి కరోనా లక్షణాలు కన్పించాయని వారిలో అత్యధికులు చెప్పినట్లు సర్వే పేర్కొంది. అభిప్రాయం చెప్పినవారిలో 67 శాతం మంది పురుషులు.

ఒక్కరోజులో 26 శాతం పెరిగిన కేసులు..

ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది. ఆదివారంనాడు 461 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శనివారంతో పోలిస్తే 26 శాతం అధికంగా కేసులు వెలుగుచూడగా పాజిటివిటీ రేటు 5.33గా నమోదైంది. కాగా ప్రస్తుతం 12 ఏళ్లలోపు చిన్నారులు, పాఠశాల విద్యార్థినీవిద్యార్థులు కరోనా ఎక్కువగా ప్రభావం చూపుతోంది. వ్యాక్సినేషన్‌ జరగపోవడంవల్లే వారు మహమ్మారిబారిన పడుతున్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీలో నమోదవుతున్న కొత్త కేసుల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో స్కూల్‌కు వెళ్లే చిన్నారులే ఉంటున్నారు. ఏమాత్రం రోగ లక్షణాలున్నా సోమవారంనాడు స్కూలుకు పంపవద్దని కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. అయితే, కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, హాస్పిటల్‌లో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉంటున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తెలిపారు. మరోవైపు కోవిడ్‌ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మాస్క్‌ ధరించనివారిపై రూ.500 మేర జరిమానా విధించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

దేశం మొత్తంమీద 1150 కొత్త కేసులు..

- Advertisement -

రాజధానిలో కేసుల వ్యాప్తి ఎక్కువగానే ఉన్నప్పటికీ గడచిన దేశం మొత్తంమీద కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడచిన 24 గంటల్లో దేశంలో 1150 కొత్త కేసులు నమోదుకాగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారంతో పోలిస్తే 192 కేసులు అధికంగా వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,42,097కు చేరుకోగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 11,558గా ఉంది. పాటిజివిటీ రేట్‌ 0.03గా ఉండగా రికవరీ రేట్‌ 98.76శాతంగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement