Saturday, May 18, 2024

Politics: ఎమ్మెల్యే మైఖెల్​ లోబోని సస్పెండ్ చేసిన కాంగ్రెస్.. బీజీపీకి అమ్ముడుపోవడమే కారణం!​

పార్టీ ఫిరాయింపులకు కుట్ర పన్నారని గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మైఖేల్ లోబోను కాంగ్రెస్ ఆదివారం తొలగించింది. గోవాలో పార్టీని బలహీనపరిచేందుకు లోబో, మాజీ సీఎం దిగంబర్ కామత్ నేతృత్వంలో ఈ కుట్రకు తెరతీసినట్టు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) గోవా ఇన్‌చార్జ్ దినేష్ గుండూరావు చెప్పారు. బీజేపీతో కలిసి ఈ కుట్రకు తెగబడ్డారని దీనికి మైఖేల్ లోబో, దిగంబర్ కామత్ నాయకత్వం వహించారని దినేష్ అన్నారు. దీంతో మైఖేల్ లోబోను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, ఆయన గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా లేరని ప్రకటించారు.

గోవా రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని అంతం చేయాలని బీజేపీ భావిస్తోందని ఆరోపిస్తూ ఈ ఇద్దరు వ్యక్తులు బీజేపీతో పూర్తి సమన్వయంతో పనిచేశారని.. ఒక వ్యక్తి- దిగంబర్ కామత్- తనపై చాలా కేసులు ఉన్నందున తనను తాను కాపాడుకోవడానికి ఇలా చేసినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. అవతలి వ్యక్తి- మైఖేల్ లోబో- అధికారం & పదవి కొరకు పార్టీని నాశనం చేయాలని చూశారని తెలిపారు.

కనీసం ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడేలా చూడడానికి బీజేపీ విభజన ప్రయత్నాలు చేస్తోందని గుండూరావు మండిపడ్డారు. మా వాళ్లలో చాలా మందికి భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారు. అది ఎంత అంటే.. వారు ఆఫర్ చేసిన మొత్తాన్ని చూసి షాక్ అయ్యాను. కానీ మా ఆరుగురు ఎమ్మెల్యేలు వారి ఆఫర్లకు లొంగిపోలేదు. నేను వారిని చూసి గర్విస్తున్నా” అని  పార్టీ నేత అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement