Friday, May 3, 2024

ఉద్యోగాల పేరుతో వ‌సూళ్ల దందా.. వృద్ధాశ్రమం నిర్వహకురాలు శ్రీదేవిపై పీడీయాక్ట్

అమ్మ అనాథ వృద్ధాశ్ర‌మ నిర్వాహ‌కురాలు రాచ‌మ‌ల్ల శ్రీ‌దేవిపై పోలీసులు పీడీ యాక్ట్ న‌మోదైంది. ప్ర‌భుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డ‌బ్బు వ‌సూళ్ల‌కు పాల్ప‌డ్డ‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ మేర‌కు పోలీసుల‌కు ఆధారాల‌తో స‌హా కంప్లెయింట్ రావ‌డంతో ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ త‌రుణ్ జోషీ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని కాజీపేట, హన్మకొండ, కేయూసీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాని నిరుద్యోగుల నుండి లక్షల్లో శ్రీ‌దేవి డబ్బు వసూళ్ల‌కు పాల్పడుతోంద‌ని సీపీ తెలిపారు. ఈమేర‌కు రాచమల్ల శ్రీదేవిపై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీచేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను కాజీపేట ఇన్స్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి నిందితురాలికి ఖమ్మం కారాగారంలో అందజేసి, నిందితురాలిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

పీడీ యాక్ట్ అందుకున్న నిందితురాలు తన భర్తకు విడాకులు ఇచ్చి ఇటీవల ఉద్యోగాలు ఇప్పిస్తాని పెద్ద మొత్తంలో వసూళ్ల‌కు పాల్పడిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి. చివరకు పోలీసులకు చిక్కి పీడీ యాక్ట్ తో చంచల్ గూడ కారాగారానికి చేరుకుంది. చర్లపల్లిలో ఉన్న బానోత్ రాజ్ కుమార్ తో కలిసి అమ్మ అనాథ‌ వృద్ధాశ్రమం నిర్వ‌హిస్తూ.. దాని ముసుగులో మరో వ్య‌క్తి రాజ్ కుమార్ తో కలిసి ఈజీగా డబ్బు సంపాదించాల‌నే అత్యాశ‌తో మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ జోషీ మాట్లాడూతూ.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తం ఉండాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మోస‌పూరిత వ్య‌క్తుల ద్వారా రావ‌ని, పరీక్షల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వస్తాయని గమనించాలని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement