Sunday, April 21, 2024

Clarification – రేవ్ పార్టీ నా… అరెస్టా – అంతా ఫేక్ న్యూస్ – హిమజా

నటి బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో రేవ్ పార్టీని హైదరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు భాగం చేసినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

దాదాపు 11 మంది సెలబ్రిటీలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కూడా నమోదు చేశారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిమజ తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. ఈ వార్తలన్నీ అవాస్తవం అని చెబుతూ తాను తన నివాసంలో దీపావళికి హౌస్ పార్టీ ప్లాన్ చేసుకుని తనకు కావాల్సిన వాళ్ళందర్నీ పిలుచుకున్నానని చెప్పుకొచ్చింది. తాను కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి దీపావళి కావడంతో బంధువులను మిత్రులను పిలిచి ఒక మంచి పార్టీ చేసుకున్న సమయంలో ఎవరో తెలియని వారు పోలీసులకు సమాచారం ఇచ్చారని పోలీసులు వచ్చి ఏం జరుగుతోందని ప్రశ్నించి ఏమైనా చట్ట విరుద్ధంగా జరుగుతుందా లేదా అని చెక్ చేసి వెళ్లారని హేమజ చెప్పుకొచ్చింది. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారని ఎలక్షన్స్ టైం కాబట్టి ఏమైనా తప్పుగా జరుగుతుందేమో అనే ఉద్దేశంతో వచ్చి చెక్ చేశారు కానీ ఎలాంటి చట్ట విరుద్ధమైన పనులు జరగడం లేదని తెలుసుకుని వెళ్లిపోయారని హిమజ చెప్పుకొచ్చింది

https://www.instagram.com/tv/CzienS2RR3C/?igshid=MWtwMXBib3VwN2ZpcA==

Advertisement

తాజా వార్తలు

Advertisement