Monday, May 20, 2024

Cabinet Meeting | తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 2 గ్యారంటీలకు గ్రీన్ సిగ్నల్ – అమలుకు డేట్ ఫిక్స్

తెలంగాణ‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలపై మొదటి కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ మిటింగ్ నిర్ణయాల గురించి తెలియజేశారు. ఈ సమావేశంలో.. ప్రతి గ్యారంటీ విషయంలో సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ మొదటి కేబినెట్‌లో రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. రేపు మళ్లీ ఈ రెండు గ్యారంటీలపై సుదీర్ఘంగా ఆయా విభాగాల ఉన్నతాధికారులతో చర్చించి సోనియా గాంధీ పుట్టినరోజున (డిసెంబరు 9న) వాటిని మొదలు పెడతామని అన్నారు.

అమలు చేయబోయే రెండు గ్యారంటీలు

మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీలో భాగంగా పది లక్షల వరకూ పెంపు గ్యారంటీలను ముందుగా అమలు చేయాలని నిర్ణయించామని శ్రీధర్ బాబు వివరించారు. డిసెంబర్ 9 నుంచి వీటిని అమలు చేస్తామని అన్నారు. ఆధార్ కార్డు లేదా, ఏదైనా గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని శ్రీధర్ బాబు తెలిపారు. సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 9 నుంచి ఈ రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించినట్లుగా శ్రీధర్ బాబు తెలిపారు.

- Advertisement -

రేపు విద్యుత్ రంగంపై సీఎం రేవంత్ సమీక్ష

విద్యుత్ అంశంపై ఉన్న గ్యారంటీలో భాగంగా కోతలు లేని విద్యుత్ సరఫరా కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. 2014లో ఇప్పటిదాకా విద్యుత్ రంగంలో అనేక తప్పులతడకలు ఉన్నాయని చెప్పారు. ఈ అంశాలపై కూడా చర్చించామని అన్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో సమావేశమై సమీక్ష జరుపుతారని అన్నారు. దీంట్లో కరెంటు రంగానికి సంబంధించి అనేక అంశాలు చర్చిస్తారని చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం – మంత్రి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను కోరినట్లుగా శ్రీధర్ బాబు చెప్పారు. 2014 నుంచి 2023, డిసెంబర్ 7 వరకూ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రకటించారు. రేపు విద్యుత్ శాఖపై ఉన్నతాధికారులతో రేవంత్ సమీక్ష చేస్తారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement