Saturday, July 27, 2024

Cabinet … మోదీ కేబినెట్ లో ఏడుగురు మ‌హిళ‌ల‌కు చోటు

ప్రధాని మోదీ మంత్రివర్గంలో ఈసారి మహిళా మంత్రుల సంఖ్య తగ్గింది. ఎన్డీయే మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన క్రమంలో మొత్తం ఏడుగురు మహిళలను మంత్రి పదవులు వరించగా వారిలో ఇద్దరికి కేబినెట్ హోదా దక్కింది. అయిదుగు స‌హాయ మంత్రులుగా చోటు ద‌క్కించుకున్నారు. గత ప్రభుత్వంలో 10 మంది మహిళా మంత్రులు ఉండటం గమనార్హం.

మాజీ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎంపీలు అన్నపూర్ణా దేవి, శోభా కరండల్జే, రక్షా ఖడ్సే, సావిత్రీ ఠాకూర్, నిమూబెన్ భంభానియా, అప్నా దళ్ ఎంపీ అనుప్రియ పటేల్‌కు మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు. మంత్రి వర్గంలో తిరిగి చోటు దక్కని వారిలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, మేన‌కాగాంధీ, భారతీ పవార్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, దర్శనా జార్దోశ్, మీనాక్షీ లేఖీ, ప్రతిమా భౌమిక్ ఉన్నారు. . నిర్మలా సీతారామన్, దేవీలకు కేబినెట్ హోదా దక్కింది. మిగతా వారు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దేవీ, ఖరండల్జే, ఖడ్సే, షెరావత్, పటేల్‌లకు కొత్తగా మంత్రివర్గంలో స్థానం దక్కింది. గత లోక్‌సభలో మొత్తం 78 మంది మహిళా ఎంపీలు ఉండగా ఈ సారి వారి సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఇటీవలి ఎన్నికల్లో మొత్తం 74 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement