Thursday, May 9, 2024

వైద్యశాఖలో ఉద్యోగాల పేరుతో బోగస్‌ ప్రచారం.. ఫేక్‌ లెటర్లతో సోషల్‌మీడియాలో పోస్టింగ్‌లు

అమరావతి, ఆంధ్రప్రభ: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేరుతో పలు ఉద్యోగాలకు రిక్రూ-టె-్మంట్‌ చేపడుతున్నట్టు సోషల్‌ మీడియాలో కొందరు బోగస్‌ ప్రచారానికి తెరలేపారు. ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఎం.డి, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఏపీ తరపున ఎటువంటి నోటిఫికేషనూ ఇవ్వలేదు. అయినప్పటికీ కొలువుల పేరుతో పోస్టింగ్‌లు సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయి. ఉద్యోగాల పేరుతో యువతను నమ్మించి వసూళ్ల పర్వానికి తెరలేపాలన్నది దీని వెనుకున్న కుట్రగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై స్పందించిన ఆరోగ్య కుటు-ంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ వైద్యశాఖలో ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ విడుదల కాలేదని స్పష్టం చేశారు.

సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు సూచించారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఎంఎల్‌ హెచ్‌ పి , మెడికల్‌ ల్యాబ్ టెక్నీషియన్‌ , ఫార్మాసిస్ట్‌ పోస్టులకు ఏపీలో నియామకాలు చేపడుతున్నట్టు ఫేక్‌ లెటర్లను తయారు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫేక్‌ లెటర్లు తయారు చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన హెచ్చరించారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఎలాంటి రిక్రూట్మెంట్‌ చేపట్టినా పేపర్‌ నోటిఫికేషన్‌ ద్వారా తెలియజేస్తామన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement