Friday, April 26, 2024

నవంబర్‌ 29 నుంచి బ్లూటిక్‌ సేవలు.. ఎలాన్‌ మస్క్‌ వెల్లడి

ట్విటర్‌లో నకిలీ ఖాతాలను అరికట్టేందుకు నిలిపివేసిన బ్లూటిక్‌ సేవలను పునరుద్ధరించేందుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయని సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. నవంబర్‌ 29 నుంచి ఈ సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకు వస్తామని ఆయన ప్రకటించారు. బ్లూటిక్‌లో ఎలాంటి లోపాలు లేకుండా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
నవంబర్‌ 6 ప్రారంభమైన ఈ సేవలను ట్విటర్‌ ప్రారంభించింది. నెలకు 8 డాలర్లు చెల్లిస్తే కొన్ని అదనపు ప్రయోజనలు ఉండేలా బ్లూటిక్‌ సేవలను ప్రారంభించారు. ఈ సేవలు ప్రారంభమైన వెంటనే వెల్లువలా నకిలీ ఖాతాలు పుట్టుకొచ్చాయి. ఈ నకిలీ ఖాతాలు అసలు సంస్థల కంటే ముందే బ్లూటిక్‌ సదుపాయాన్ని పొందాయి. ఇలా ఏది నకిలీనో, ఏది అసలు ఖాతానో తెలియక గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి.

భారత్‌లో నెమ్మదిగా ట్విటర్‌
భారత్‌లో ట్విటర్‌ చాలా నెమ్మదిగా పని చేస్తోందని ఎలాన్‌ మస్క్‌ స్వయంగా ప్రకటించారు. ఇండోనేషియాతో పాటు మరికొన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. హోంలౖౖెన్‌ ట్విట్లు రీఫ్రెష్‌ కావడానికి 10-15 సెకన్లు పడుతోందని మస్క్ తెలిపారు. ముఖ్యంగా అండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ సమస్య ఉంది. ట్విటర్‌ ఇంజినీర్లు చెప్పినదాని కంటే ఇది ఎక్కువ సమయం తీసుకుంటోంది. అమెరికాలో ఇలా రీఫ్రెష్‌ అయ్యేందుకు 2 సెకన్లు పడితే భారత్‌లో మాత్రం 20 సెకన్ల సమయం తీసుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement