Thursday, May 16, 2024

Bishan Singh Bedi – టీమిండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూత

భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూశారు. ఆయనకు 77 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు మరణించారు దిగ్గజ స్పిన్నర్ 1967 -1979 మధ్య భారత్‌ తరపున 67 టెస్టులు ఆడి 266 వికెట్లు తీశాడు

10 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఎరపల్లి ప్రసన్న, బీఎస్‌ చంద్రశేఖర్, ఎస్‌ వెంకటరాఘవన్‌లతో పాటు బేడీ భారత్‌ స్పిన్ బౌలింగ్‌ దశ, దిశను మార్చాడు. భారత్ తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించింది బిషన్‌సింగ్‌ బేడినే. 1975 ప్రపంచ కప్ మ్యాచ్‌లో అతని 12 ఓవర్లు వేసి కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ 12 ఓవర్లలో అతను ఏకంగా ఎనిమిది మెయిడిన్లు చేశాడు. ఒక్క వికెట్‌ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా తూర్పు ఆఫ్రికాను 120 స్కోరుకే పరిమితం చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement