Wednesday, May 15, 2024

Followup : ‘కలర్ ఫొటో’కి బెస్ట్​ అవార్డు.. సంగీతంలో తమన్​.. 68వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్ర ‘కలర్ ఫొటో’ అవార్డు దక్కించుకోగా, ఉత్తమ కొరియోగ్రఫీ చిత్రంగా ‘నాట్యం’ ఎంపికైంది. ఉత్తమ సంగీత చిత్రంగా ‘అల వైకుంఠపురంలో’ ఎంపికవగా, ఆ చిత్రానికి సంగీతాన్ని అందించిన తమన్ ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు)గా అవార్డు దక్కించుకున్నారు. ‘నాట్యం’ చిత్రానికి మేకప్ విభాగంలో అవార్డు దక్కింది. ఉత్తమ మేకప్ ఆర్టిస్టుగా టీవీ రాంబాబు (నాట్యం) ఎంపికయ్యారు. 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల కోసం మొత్తం 30 భాషల్లో 305 ఫీచల్ ఫిల్స్మ్ ఎంట్రీలు వచ్చాయి. నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 20 భాషల్లో 148 చిత్రాలు స్క్రీనింగ్ కు వచ్చినట్టు జ్యూరీ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది అవార్డులను 5 ప్రధాన కేటగిరీలుగా విభజించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్స్ (28 కేటగిరీలు), నాన్-ఫీచర్ ఫిల్మ్స్ (22 కేటగిరీలు), బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ కేటగిరీలుగా విభజించి అవార్డులు ప్రకటించారు. మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్స్‌గా ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. బెస్ట్ బుక్ ఆన్ సినిమా అవార్డులు ‘ద లాంగెస్ట్ కిస్’ (కిష్వర్ దేశాయ్) దక్కించుకుంది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును విడిగా మరోసారి ప్రకటించనున్నట్టు జ్యూరీ సభ్యులు వివరించారు.

తమిళ సినిమా ‘సూరారైపోట్రు’ (తెలుగులో ఆకాశం నీ హద్దురా) ఏకంగా 3 అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటీనటుల అవార్డులు ఈ చిత్రానికి దక్కాయి. అజయ్‌ దేవ్‌గణ్‌ నటించిన ‘తానాజీ’ చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డులకు ఎంపికైంది. సూరారై పోట్రులో నటించిన సూర్య, తానాజీ హీరో అజయ్‌ దేవగణ్‌ ఉత్తమ కథానాయకులుగా సంయుక్తంగా ఎంపికయ్యారు. సూరారై పోట్రు హీరోయిన్‌ అపర్ణ బాలమురళి ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు జాతీయ అవార్డులు దక్కాయి. నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఉత్తమ కుటుంబ చిత్రంగా మరాఠీకి చెందిన కుంకుమార్చన్‌ ఎంపికైంది. నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఉత్తమ ఫిక్షన్ స్టోరీ చిత్రంగా అసోంకు చెందిన కచ్చి చినుకుకు అవార్డ్‌ దక్కింది. ఈ ఏడాది బెస్ట్ క్రిటిక్‌ అవార్డు ఎవరికీ ఇవ్వలేదని జ్యూరీ సభ్యులు ప్రకటించారు.

ఉత్తమ నటుడు: సూర్య (సూరారై పోట్రు), అజయ్‌ దేవ్‌గణ్‌ (తానాజీ)

ఉత్తమ నటి అపర్ణ బాలమురళి (సూరారై పోట్రు)

ఉత్తమ చిత్రం :సూరారై పోట్రు (సుధాకొంగర)

- Advertisement -

ఉత్తమ దర్శకుడు: దివంగత సచ్చిదానందన్‌ (అయ్యప్పనుమ్‌ కోషియుం)

ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్‌ సిలా పెంగళం)

ఉత్తమ సహాయ నటుడు: బిజూ మేనన్‌ (అయ్యప్పనుమ్‌ కోషియుం)

ఉత్తమ కటుంబ విలువల కథాచిత్రం ‘కుంకుం అర్చన్’

స్పెషల్ జ్యూరీ అవార్డు ‘అడ్మిటెడ్’

బెస్ట్ తెలుగు ఫిల్మ్ – ‘కలర్ ఫోటో’

బెస్ట్ కొరియోగ్రఫీ – సంధ్యా రాజు (నాట్యం)

బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ – రాంబాబు (నాట్యం)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – థమన్ (అల వైకుంఠపురములో)

బెస్ట్ మూవీ – సూరారై పోట్రు (సుధా కొంగర)

బెస్ట్ డైరెక్టర్ – సచ్చిదానంన్(అయ్యప్పనుమ్ కొషియమ్)

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – లక్ష్మీ ప్రియ
చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్‌ సిలా పెంగళం)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – బిజూ మేనన్‌ (అయ్యప్పనుమ్‌ కోషియుం)

ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన సినిమా – తానాజీ

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement