Saturday, May 18, 2024

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న బెల్లంకొండ గ‌ణేశ్- ఆగ‌స్టు 13న‌ స్వాతి ముత్యం రిలీజ్

హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు బెల్లంకొండ గ‌ణేశ్. స్వాతిముత్యం టైటిల్ తో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది.ఈ సినిమాలో సాఫ్ట్ క్యారెక్టర్ తో ఆయన తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. ఆగస్టు 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రావు రమేశ్ .. నరేశ్ .. ప్రగతి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement