Sunday, December 4, 2022

భారత క్రికెట్‌ జట్టులో కెప్టెన్ల సంఖ్య పెంపు.. బీసీసీఐ యోచన

ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌ 2022లో భారత జట్టు పరాజయం చెందిన నేపథ్యంలో ఏకంగా జాతీయ సెలక్షన్‌ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్‌ జట్టులో స్ప్లిట్‌ కెప్టెన్సీ (వేర్వేరు కెప్టెన్లు) అమలు చేయాలని చూస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో టి 20 ఫార్మట్‌లో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేక వ్యక్తిగతంగా దారుణమైన ప్రదర్శన చేయడంతో రోహిత్‌ శర్మను భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కుదించారు. వన్‌ డే లకే పరిమితం చేశారు.

- Advertisement -
   

టీ 20 కెప్టెన్సీ బాధ్యతలను హార్థిక్‌ పాండ్యాకు ఇచ్చారు. కొత్త సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుని హార్థిక్‌ పాండ్యాకు ఎక్కువ కాలం టీ 20 కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేయాలని బీసీసీఐ భావిస్తోంది. రోహిత్‌పై భారం తగ్గించేందుకు టెస్ట్‌, వన్డే ఫార్మట్లలో కూడా ఏదో దానిపై కోత పెట్టే అంశాన్ని కూడా బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు ఫార్మట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉంటే టీమ్‌ ఇండియా మరింత బలో పేతం అవుతుందని బీసీసీఐ భావన. రోహిత్‌ శర్మ వన్డే, టెస్ట్‌ ఫార్మెట్‌లలో ఏదో ఒకదాని మీద దృష్టి కేంద్రీ కరిస్తే మంచి ఫలితాలు వస్తాయని బీసీసీఐ ఆలోచన.

Advertisement

తాజా వార్తలు

Advertisement