Saturday, March 2, 2024

బాల‌కృష్ణ‌కి త‌ప్పిన ప్ర‌మాదం.. అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయిన‌ హెలికాప్ట‌ర్

ఒంగోలు నుండి నేడు హైద‌రాబాద్ కి హెలికాప్ట‌ర్ లో ప్రయాణ‌మ‌య్యారు హీరో బాల‌కృష్ణ‌. కాగా ఆయ‌న ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. నిన్న సాయంత్రం ఒంగోలులో బాలయ్య సినిమా ‘వీర సింహారెడ్డి’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. కార్యక్రమం అనంతరం బాలయ్య నిన్న రాత్రి ఒంగోలులోనే బస చేశారు. ఒంగోలు నుంచి హైదరాబాద్ కు ఆయన హెలికాప్టర్ లో బయల్దేరారు. ఆయనతో పాటు సినీ నటి శృతిహాసన్, సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ తదితరలు ఉన్నారు. ఒంగోలు నుంచి బయల్దేరిన 15 నిమిషాలకు హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హెలికాప్టర్ ను వెనక్కి మళ్లించిన పైలట్ ఒంగోలులో ని హెలిపాడ్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం సాంకేతిక సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు నిన్న హైదరాబాద్ నుంచి ఒంగోలుకు బాలయ్య ఇదే హెలికాప్టర్ లో వెళ్లారు. బాలయ్యకు ప్రమాదం తప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement