Wednesday, May 22, 2024

24 వేళ్లతో శిశువు జననం

జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వింత ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్‌లోని ఎర్గట్లకు చెందిన రవళి అనే మహిళ ఇవాళ తెల్లవారుజామున మగబిడ్డకు జన్మనివ్వగా.. శిశువు చేతులు, కాళ్లకు మొత్తం కలిపి 24 వేళ్లు ఉన్నాయి. వివారాల్లోకి వెళ్తే… నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలం ఏరుగట్లకు చెందిన రవళి అనే మహిళకు పురిటినొప్పులు రావటంతో కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్య సిబ్బంది ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు. అయితే పసికందుకు రెండు కాళ్లు, రెండు చేతులకు కూడా ఆరువేళ్లు ఉండటాన్ని వైద్యులు గమనించారు. ప్రతి చేయి కాలుకు ఆరు వేళ్ల చొప్పున మెుత్తం 24 వేళ్లతో శిశువు జన్మించాడు. ఇలా ఆరు వేళ్లతో జన్మించిన పిల్లలు పుట్టడం అత్యంత అరుదుగా జరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలా ఆరు వేళ్లతో పుట్టిన శిశువును చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement