Tuesday, April 30, 2024

పర్యటనలతో అవగాహన అధికమవుతోంది.. యూత్‌ హాస్టల్స్‌లో మహిళా విభాగం విహాంగ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పర్యటనలతో మానసిక, శారీరక ఆరోగ్యం సుసంపన్నమవుతోందని తెలంగాణ యూత్‌ హాస్టల్స్‌ విభాగం విహంగ అధ్యక్షురాలు విమల, చైర్మన్‌ జి.వజ్రేశ్వరి, ఉపాధ్యక్షురాలు పి.గిరిజ చెప్పారు. ప్రయాణాల్లో విభిన్న సంస్కృతి, ఆచారవ్యవహారాలు, సరికొత్త స్నేహితులను పరిచయం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనసాగించే మనదేశంలో విభిన్న సంస్కృతులపై అవగాహన కలిగేందుకు పర్యటనలు ఉపయోగ పడతాయని చెప్పారు.

విహాంగ కార్యవర్గాన్ని ఆదివారం తెలంగాణ యూత్‌ హాస్టల్స్‌ చైర్మన్‌ వెంకట్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు విమల మాట్లాడుతూ మహిళలు పర్యటనల ద్వారా అనేక అంశాలపై అవగాహన పెరుగుతోందని చెప్పారు. దేశంలో 9 మహిళా విభాగాలున్నాయని తెలిపారు. తెలంగాణలో 106 పైగా సభ్యులతో మహిళాయూనిట్‌ ఆవిర్భవించడం ప్రశంసనీయమన్నారు. వైహెచ్‌ఎ చైర్మన్‌ వెంకట్‌ యాదవ్‌ మాట్లాడుతూ పర్యటనల ద్వారా అవగాహన పెరుగుతోందని తెలిపారు.

దేశంలోని అనేక రంగాల్లో విజేతలుగా నిలిచిన మహిళలతో పరిచయాలు ఏర్పడటంతో మహిళ మరింత శక్తి వంతమవుతుందన్నారు. తెలంగాణ యూత్‌ హాస్టల్స్‌ కు అనుబంధంగా విహాంగ మహిళా యూనిట్‌ కార్యవర్గాన్ని ఏర్పాటుచేసినట్లు ఆయన వివరించారు. అధ్యక్షురాలుగా కె.విమల, ఉపాధ్యక్షురాలుగా పి.గిరిజ, చైర్మన్‌ గా జి.వజ్రేశ్వరి, కార్యదర్శి జి.సత్యవతి, కోశాధికారి ఆర్‌. శ్రీవీణ, కార్యవర్గ సభ్యులుగా వంగ యశోద,మిర్యాల పద్మ, ఎం.కవిత, టి.సూర్యకుమారి, కుందారపు పద్మావతి ఎన్నికైనట్లు తెలంగాణ యూత్‌ హాస్టల్స్‌ చైర్మన్‌ వెంకట్‌ యాదవ్‌ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement