Tuesday, April 30, 2024

టైటానిక్ రికార్డును బ్రేక్ చేసిన.. అవ‌తార్2

అవ‌తార్2 చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రాల్లో టాప్ 3 ప్లేస్ లో ఉంది. టైటానిక్‌($2.217 బిలియన్) పేరిట ఉన్న రికార్డును అవతార్‌-2 తాజాగా బ్రేక్‌ చేసింది. మొదటి రెండు స్థానాల్లో అవతార్‌-1, అవేంజర్స్‌ ఎండ్‌గేమ్‌ సినిమాలున్నాయి. మిక్స్డ్‌ టాక్‌తోనే ఈ రేంజ్‌లో కలెక్షన్‌లు సాధించిందంటే జేమ్స్‌ క్యాలిబరీ ఎంటో ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఈ సినిమా ఇండియాలోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అవతార్‌-2 మూవీ ఇండియాలో అత్యధిక కలెక్సన్‌లు సాధించిన హాలీవుడ్‌ సినిమాగా రికార్డు క్రియేట్‌ చేసింది. ఫుల్‌రన్‌ ముగిసే సరికి ఇండియాలో రూ.386.90 కోట్ల కలెక్షన్లు సాధించింది.అవతార్‌-2’ గతేడాది డిసెంబర్‌లో రిలీజై మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. కానీ కలెక్షన్‌లలో మాత్రం జోరు చూపించింది. జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టికి ప్రేక్షకులు నీరాజనాలు పలుకారు. మొదటి భాగంలో పండోరా గ్రహంలోకి తీసుకెళ్లిన జేమ్స్‌ కామెరూన్‌.. ఈ సారి సముద్ర గర్భంలోకి తీసుకెళ్లాడు. విజువల్స్‌తో మాయ చేశాడు. సినిమా రిలీజై రెండు నెలలు దగ్గరికొస్తున్నా ఇంకా కొన్ని చోట్ల అవతార్‌ హవానే కొనసాగుతుంది. అయితే ఇండియాలో ఈ సినిమాకు ఎండింగ్‌ కార్డు పడినా.. పక్క దేశాలలో మాత్రం ఇంకా దీని జోరే నడుస్తుంది. కాగా తాజాగా ఈ సినిమా టైటానిక్‌ కలెక్షన్‌లు దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement