Monday, October 7, 2024

Atrocity: యూపీలో దారుణం… అంబులెన్స్‌ లేక తోపుడు బండిపై మృత‌దేహం త‌ర‌లింపు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ద‌య‌నీయ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఫిరోజాబాద్ జిల్లాలో అంబులెన్స్‌కు బ‌దులు తోపుడు బండే దిక్కైంది. గుండెపోటుతో మరణించిన ఓ మహిళ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్‌ లభ్యం కాలేదు. దాంతో ఆమె భర్త తోపుడుబండిపై మృతదేహాన్ని తీసుకెళ్లాడు.

అస్రౌలి గ్రామానికి చెందిన వేద్‌రామ్‌ భార్య మోహర్‌కు గుండెపోటు వచ్చింది. చికిత్స నిమిత్తం ఆమెను ఫిరోజాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలోని ట్రామా కేంద్రంలో చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మరణించింది. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అంబులెన్సు కావాలని ఆమె భర్త కోరాడు. గంటల కొద్ది వేచి ఉన్నా ఎవరూ తన గోడు వినిపించుకోకపోవడంతో చివరకు తోపుడుబండిపై ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లాడు. స్థానికులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి వైరల్‌ చేయడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నవీన్‌ జైన్‌ విచారణకు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement