Friday, May 3, 2024

చైనాకు యాపిల్‌ షాక్‌.. షెన్‌జెన్‌లోని ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత

చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి టెక్‌ దిగ్గజం యాపిల్‌ భారీ షాక్‌ఇచ్చింది. చైనాలోని షెన్‌జెన్‌లోని తన ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేస్తూ యాపిల్‌ సోమవారం తీవ్ర నిర్ణయం తీసుకుంది. దక్షిణ చైనాలో షెన్‌జెన్‌ సిటీ టెక్‌హబ్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ నగరంలో యాపిల్‌ సంస్థ చైనా షెన్‌జెన్‌కు చెందిన ఫాక్స్‌ కాన్తో ఐఫోన్‌కు అవసరమయ్యే విడిభాగాలను తయారుచేస్తోంది.

తాజాగా కరోనా కేసులు పెరగడంతో ఐఫోన్‌ల తయారీని ఆపేస్తున్నట్లు యాపిల్‌ వెల్లడించింది. కరోనా కారణంగా చైనా పలు ఆంక్షలును అమలుచేస్తోంది. దక్షిణ చైనాలోని పలునగరాల్లో విస్తృతంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.ఈ క్రమంలో పలు నగరాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement