Wednesday, May 1, 2024

Animal Movie – ఆకాశంలో ర‌ణ‌బీర్ కు ర‌ష్మిక లిప్ లాక్… మండిప‌డుతున్న అభిమానులు .

బాలీవుడ్ లో రష్మిక బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో రష్మిక కలిసి న‌టిస్తున్న మూవీ ‘యానిమల్’ పోస్టర్ ను చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది. ఆకాశంలో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో రష్మిక, రణబీర్ కపూర్ ల లిప్ లాక్ సన్నివేశాన్ని పోస్టర్ గా వదిలారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. రేపు ఈ చిత్రానికి చెందిన ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది.

ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా, ర‌ష్మిక ఆకాశంలో లిప్ లాక్ ఇవ్వ‌డాన్ని ఆమె అభిమానులు మండిప‌డుతున్నారు..ఆకాశంలోనే ఇన్ని లిప్ లాక్ లు ఉంటే ఇక సినిమా మొత్తంలో ఇంకెన్ని ఉంటాయోనంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement