Friday, October 4, 2024

చిత్తూరు జిల్లాలో కరెంట్‌ షాక్‌తో ఏనుగు మృతి

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో క‌రెంట్ షాక్ తో ఏనుగు మృతి చెందింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం కొదలమడుగు గ్రామం వద్ద బోరుకున్న వైర్ల‌ను ఏనుగు తొండంతో ధ్వంసం చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. వెంట‌నే స్థానికులు ఫారెస్ట్ అధికారులు స‌మాచారం అందించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఏనుగు కళేబరాన్ని ఖననం చేయనున్నారు. ఇదే మండలంలో గత పది రోజుల్లో రెండవ ఏనుగు మృతి చెంద‌డం విశేషం. ప‌లు గ్రామాల్లో ఏనుగులు సంచ‌రిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వెంట‌నే ఫారెస్ట్ అధికారులు స్పందించి ఏనుగుల‌ను ప‌ట్టుకుని అట‌వీ ప్రాంతాల్లో వ‌దిలేయాని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement