Saturday, May 18, 2024

చైనాలో మహిళల రక్షణ చట్టానికి సవరణ..

పనిప్రదేశాలలో లింగ వివక్ష, లైంగిక వేధింపుల నుండి మహిళలకు మరింత రక్షణ కల్పించే లక్ష్యంతో రూపొందించబడిన చట్టానికి చైనా సవరణలు చేసింది. మూడవ పునర్విమర్శ, విస్తృతమైన ప్రజా సూచనల తర్వాత గురువారం గురువారం పార్లమెంటుకు సమర్పించబడింది. దాదాపు 30 ఏళ్లలో మహిళల రక్షణ చట్టాన్ని సవరించడం ఇదే తొలిసారి. ”మహిళల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ చట్టం” ముసాయిదా నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ స్టాండింగ్‌ కమిటీకి స మర్పించబడిందని అధికారిక జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. తాజా ముసాయిదా ప్రజలకు విడుదల చేయబడలేదు కానీ, ప్రభుత్వం ప్రజల సూచనలకు ఆహ్వానించింది.

ఈ ముసాయిదా పేద, వృద్ధ మహిళలు, వికలాంగ మహిళల వంటి వెనుకబడిన సమూహాల హక్కులు, ప్రయోజనాల రక్షణను బలోపేతం చేస్తుందని జిన్హువా పేర్కొంది. పనిప్రదేశాల్లో మహిళల సామాజిక భద్రత హక్కులు ఉల్లంఘించబడితే, యజమానులను బాధ్యులను చేస్తారు. అదే సమయంలో అక్రమ రవాణాకు గురైన, అపహరణకు గురైన మహిళలను రక్షించే బాధ్యత స్థానిక అధికారులపై కూడా ఉంటుందని జిన్హువా తెలిపింది. ముసాయిదా చట్టాన్ని చట్టంగా ఆమోదించడానికి తేదీని నిర్ణయించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement