Saturday, October 12, 2024

TS | దోస్త్‌ ప్రత్యేక విడతలో 39,969 సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్‌ స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ సీట్ల కేటాయింపు పూర్తయింది. మొత్తం 39,969 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. సీటు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా తమ సీటును నిర్ధారించుకోవాలని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ చేసిన విద్యార్థులు ఈనెల 18 నుంచి 21 వరకు కళాశాలల్లో సీటును ధృవీకరించుకోవాలని పేర్కొన్నారు.

స్పెషల్‌ ఫేజ్‌లో 41,851 మంది అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోగా వారిలో 39,969 మంది సీట్లు పొందారు. వీటిలో కామర్స్‌ సీట్లు 15,508, లైఫ్‌ సైన్సెస్‌ సీట్లు 8771, ఫిజికల్‌ సైన్సెస్‌ సీట్లు 4105 సీట్లు, బీఎస్సీ ఆనర్స్‌ (కంప్యూటర్స్‌ సైన్స్‌) 234తో పాటు ఇతర కోర్సుల్లో కలిపి ప్రత్యేక విడుతలో మొత్తం 39,969 సీట్లు నిండాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement