Wednesday, May 29, 2024

TS | అలర్ట్.. రేపు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..

శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న‌ (బుధవారం) హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శోభయాత్ర.. ఉదయం 9 గంటల నుంచి సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమై.. కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల మైదానంలో రాత్రి 11.30 గంటలకు ముగియనున్టట్టు సీపీ తెలిపారు. ఈ సందర్భంగా.. శోభాయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ పేర్కొన్నారు.

రాములోరి శోభయాత్ర.. సీతారాంబాగ్ ఆలయం నుంచి రామకోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు జరుగుతుంది. బోయిగూడ కమాన్, జాలి హనుమాన్, మంగళహాట్ పీఎస్ రోడ్, పురాణాపూల్, గాంధీ విగ్రహం, ధూల్‌పేట్, చుడిబజార్, బేగంబజార్, జుమ్మేరాత్ బజార్, బేగంబజార్ ఛత్రి, బర్తన్ బజార్, శంకర్ షేర్ హోటల్, గురుద్వారా, సిద్ధి అంబర్ బజార్, గౌలిగూడ చమన్, పుత్లిబౌలి ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్, కోఠీ మీదుగా సాగనుంది ఈ ప్రధాన శోభాయాత్రలో.. వివిధ పాయింట్ల వద్ద చిన్న చిన్న ఊరేగింపులు కూడా కలవనున్నాయి.

- Advertisement -

శ్రీరామ శోభయాత్ర ఈ ప్రాంతాల నుంచి వెళ్తున్న సమయంలో ఆయా ప్రదేశాలలో అవాంఛనీయ సంఘటనలు, అంతరాయాలు కలగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని గమ్యాలను చేరుకోవాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement