Saturday, April 27, 2024

Crashed plane: కెన‌డాలో కుప్ప‌కూలిన విమానం ..ఆరుగురు వ‌జ్రాల గ‌ని కార్మికులు దుర్మ‌ర‌ణం..

ఒట్టావా: కెనడాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కార్మికులతో వెళ్తున్న విమానం కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. నార్త్‌వెస్ట్‌ టెరిటరీస్‌లో ఈ దుర్ఘటన జరిగింది.

రియో టింటో మైనింగ్‌ సంస్థకు చెందిన దియావిక్‌ వజ్రాల గని వద్దకు కొందరు కార్మికులతో పోర్ట్‌స్మిత్‌ నుంచి చిన్న విమానం బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కాసేపటికే దానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ తర్వాత రన్‌వే చివర నుంచి కిలోమీటర్‌ పరిధిలో విమానం కుప్పకూలిందని అధికారులు గుర్తించారు.

ఈ ఘటనలో ఆరుగురు వ‌జ్రాల గ‌ని కార్మికులు మృతి చెందగా.. ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై విమానయాన సంస్థ నార్త్‌వెస్టర్న్‌ ఎయిర్‌ స్పందించింది. కుప్పకూలిన విమానం ఛార్టర్‌ ఫ్లైట్ అని పేర్కొంది. ఈ ప్రమాదంతో పోర్ట్‌స్మిత్‌ నుంచి విమాన సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు కెనడా రవాణా భద్రతా బోర్డు ప్రత్యేక బృందాన్ని నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement